An Exclusive Invitation


హనుమజ్జయంతి ఉత్సవాల శుభాహ్వానము
॥ శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు ॥
॥ శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు ॥


శ్రీ నల్లూరు వారి ధర్మతోట
హనుమజ్జయంతి ఉత్సవాలు
ది. 12-05-2026 నుండి 13-05-2026 వరకు
శ్రీ నల్లూరు వారి శ్రీ వీరాంజనేయస్వామి వారి దేవస్థానం
నల్లూరు వారి వీధి, పటమట, విజయవాడ -10.
పటమట, నల్లూరు వారి వీధిలో వేంచేసియున్న శ్రీమధఖిలాండ కోటి బ్రహ్మండ నాయకులైన శ్రీసువర్చలా సహిత
శ్రీ నల్లూరు వారి వీరాంజనేయ స్వామి వారి దేవస్థానములో
హనుమత్ జయంతి ఉత్సవములు
12-5-2026 నుండి 13-5-2026 వరకు వైభవోపేతముగా నిర్వహించుటకు దైవాజ్ఞ అయినది.
స్వస్తి శ్రీచాంద్రమానేన శ్రీ పరాభవ నామసంవత్సర వైశాఖ బహుళ దశమి మంగళవారము నుండి బహుళ ఏకాదశి బుధవారము వరకు వైఖానస ఆగమశాస్త్రాను సారముగా హనుమ దీక్షతో "హనుమత్ జయంతి" ఉత్సవములు జరుపబడును



శ్రీ పరాభవనామ సంవత్సరములో రాజు గురుడు, మంత్రి కుజుడు, సైన్యాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి - చంద్రుడు, ధాన్యాధిపతి - బుధుడు, సైన్యాధిపతి శుక్రుడు, రసాధిపతి రవి, నీరసాధిపతి గురుడు అగుట వలన ఈ నవనాయకులలో 7 ఆధిపత్యములు శుభులకు, 2 ఆధిపత్యములు పాపులకు వచ్చినవి. అన్నిరాశులవారికి మానసిక అశాంతి శరీర అనారోగ్యము అత్యధికముగా ఉండును. ఈ సంవత్సరమునందు అశ్విని, ఆరుద్ర, అనూరాధ, కృత్తిక, ఉత్తరాషాడ, మూల, రేవతినక్షత్రముల వారికి తీవ్ర అనారోగ్యము అత్యధికముగా ఉండును. కావున సర్వ గ్రహఅనుకూలత కొరకు శ్రీ వీరాంజనేయ స్వామికి విశేష అర్చనలు మన్యుసూక్త విధానముగా జరుపుటవలన సర్వగ్రహపీడితులైన వారికి మానసిక, శారీరక, ప్రశాంతత కలుగును.
మహామహిమాన్వితమైన ఈ విశేష పూజలో పాల్గొని శ్రీ వీరాంజనేయస్వామి వారి అనుగ్రహము పొందగలరు
మంగళవారము ఉదయం గం|| 5.00 సుప్రభాత సేవ 5.30 ని॥లకు విశ్వక్సేన పూజ పుణ్యాహవాజన అంకురారోపన అఖండ దీపారాధన శ్రీ స్వామి వారికి పంచామృతాలతో మన్యుసూక్త విధానేన అభిషేకము 7.00 గం॥లకు నవగ్రహపూజ ప్రారంభము.
కార్యక్రమ వివరములు:
సా|| గం 6-05 ని॥లకు శ్రీసువర్చలా సహిత వీరాంజనేయ స్వామి వారికి విశేష తిరుకళ్యాణ మహోత్సవము జరుగును

1. మేషరాశి వారికి శని, గురు, రాహు దోషమునకు
2. వృషభరాశి వారికి కేతు, బుధ దోషమునకు
3. మిథునరాశి వారికి రాహు, కేతు, శని దోషమునకు
4. కర్కాటకరాశి వారికి శని, రాహు దోషమునకు
5. సింహారాశి వారికి కేతు, బుధ, రాహు దోషమునకు
6. కన్యారాశి వారికి బుధ, శని, కేతు దోషమునకు
7. తులారాశి వారికి బుధ, శని, గురు దోషమునకు
8. వృచ్చికరాశి వారికి గురు, శని, కేతు దోషమునకు
9. ధనుస్సురాశి వారికి శుక్ర, బుధ, రాహు దోషమునకు
10. మకరరాశి వారికి బుధ, రాహు, కేతు దోషమునకు
11. కుంభరాశి వారికి శుక్ర, రాహు, శని దోషమునకు
12. మీనరాశి వారికి శని, రాహు, కేతు, గురు దోషమునకు
విశేష గ్రహపూజలు, శాంతి చేయబడును.
బుధవారము ఉదయం 5.00 గం|| సుప్రభాత సేవ విశ్వక్సేన పూజ, పుణ్యాహవాజన విశేష నవగ్రహ పూజలు పురుష సూక్త నవగ్రహ మూలమంత్రములతో పవమాన హామము జరుగును. 10.55 గం॥ పూర్ణాహుతి. ఈ హోమము చేయుట వలన ఆరోగ్యము, అభివృద్ధి మరియు ఋణబాధలు, మనోదైర్యము మానసిక ప్రశాంతత ఏర్పడును







ముఖ్య గమనిక: కావున యావన్మంది భక్తులు ఈ పవిత్ర కార్యక్రమములలో పాల్గొని, తీర్థ ప్రసాదములు స్వీకరించి, ఆ వీరాంజనేయ స్వామి వారి కృపా కటాక్షములకు పాత్రులు కాగలరని ప్రార్థన.
శ్రీ నల్లూరు వారి శ్రీ వీరాంజనేయస్వామి వారి దేవస్థానం
నల్లూరు వారి వీధి, పటమట, విజయవాడ -10.
ఇట్లు
కార్యనిర్వాహణాధికారి
బి.గంగాధర్
అనువంశిక, ధర్మకర్త
నల్లూరు రత్నశేఖర్, ఆలయ చైర్మెన్
Contact : 9966143365
© 2026. All rights reserved.


